: వాజపేయి మేనకోడలితో చర్చిస్తున్నాం: రమణ్ సింగ్


బీజేపీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ అలిగి వెళ్లిపోయిన వాజపేయి మేనకోడలు కరుణ శుక్లాను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను బీజేపీ నేతలు ప్రారంభించారు. ఎన్నికలకు ముందు ఆమె పార్టీలోంచి వెళ్లడం వల్ల తప్పుడు సందేశం వెళుతుందేమోనని బీజేపీ నేతలు భావిస్తున్నారు. దీనిపైనే చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మాట్లాడుతూ.. కరుణ చాలా సీనియర్ నేత అని, తిరిగి పార్టీలోకి తీసుకురావడంపై ఆమెతో చర్చిస్తున్నామని తెలిపారు. బీజేపీతో కరుణ శుక్లాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఆమె చత్తీస్ గఢ్ సీనియర్ నేతలు తనను మానసికంగా వేధించారని, అలక్ష్యం చేశారని ఆరోపిస్తూ కొన్ని రోజుల క్రితం పార్టీ వీడారు.

  • Loading...

More Telugu News