: త్వరలో ఘనా అధ్యక్షుడి భారత్ పర్యటన


ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామ భారత్ లో పర్యటించనున్నారు. ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు... ద్రమాని మహామ భారత్ లో పర్యటిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆయనతో పాటు ఘనా మంత్రులు, అధికారులు కూడా వస్తారని వెల్లడించింది. ఈ పర్యటనలో ప్రధాని మన్మోహన్ సింగ్ తో ఘనా అధ్యక్షుడు సమావేశమవుతారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ప్రముఖంగా చర్చిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. తర్వాత సీఐఐ, ఎఫ్ఐసీసీఐ సంయుక్తంగా ఏర్పాటుచేసే బిజినెస్ మీటింగ్ లో ప్రసంగిస్తారు.

  • Loading...

More Telugu News