: నేడు వేలానికి రానున్న మహాత్ముడి చరఖా


సామాన్య జీవితానికి చక్కని ఆదర్శప్రాయుడు, జాతిపిత మహాత్మాగాంధీ ఉపయోగించిన చరఖా(నూలు వడికిన చక్రం) నేడు బ్రిటన్ లోని ముల్లక్ వేలం శాలలో వేలానికి రానుంది. కనీస వేలం ధర 60వేల పౌండ్లు(సుమారుగా 60 లక్షల రూపాయలు). భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో గాంధీ పుణేలోని ఎరవాడ జైలులో ఉన్నప్పుడు ఈ చరఖాను ఉపయోగించారు. దీనిని అమెరికాకు చెందిన కల్నల్ పుఫ్ఫర్ కు ప్రదానం చేశారు. దీనితోపాటు ముల్లక్ హౌస్ గాంధీకి చెందిన మొత్తం 60 వస్తువులను వేలానికి పెడుతోంది. ముఖ్యమైన పత్రాలు, ఫొటోలు, పుస్తకాలు వీటిలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News