: నేటి నుంచి సీపీఐ రాష్ట్ర స్థాయి సమావేశాలు


సీపీఐ రాష్ట్ర స్థాయి సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. రంగారెడ్డి జిల్లా యాప్రాల్ లోని తులసీ గార్డెన్స్ లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో పొత్తులపైనే ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించనున్నారు. దీంతోపాటు, అఖిలపక్ష సమావేశంలో పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహంపై కూడా దృష్టి పెట్టనున్నారు.

  • Loading...

More Telugu News