: బదులుకు బదులు... 'కాటు'కు కాటు


అనగనగా ఒక రైతు. ఆ రైతు తన మానాన తాను పొలంలో పనిచేసుకుంటున్నాడు. ఇంతలో ఎక్కడినుండో వచ్చిన ఒక త్రాచుపాము ఆ రైతును కాటేసింది. సాల్మొదీన్‌ అనే ఆ రైతు ఇలా పాము కాటుకు గురై ఇంటికి వెళ్లాడు. కాలు బాగా నొప్పి పెట్టడంతో కాలును పరిశీలించిన సాల్మొదీన్‌కు కాటుకు గురైన ప్రాంతంలో పాము కోరలు బాగా దిగి కనిపించాయి. దీంతో ఆ రైతుకు బాగా కోపం వచ్చేసింది. తన మానాన తాను పనిచేసుకుంటుంటే, తనను కరిచిన పామును ఎలాగైనా తిరిగి కరవాలనుకున్నాడు.

వెంటనే పొలానికి వెళ్లాడు. పొలమంతా గాలించగా చివరికి ఆరడుగుల పొడవున్న తాచుపాము కనిపించింది. దాన్ని పట్టుకుని కసిగా నోటితో గట్టిగా కొరికాడు. దెబ్బకు అంతపెద్ద తాచుపాము చచ్చి ఊరుకుంది. అప్పటికి రైతు కసి తీరింది. పామును చంపావుగా ఇకనైనా డాక్టరు దగ్గరికి వెళ్లమంటే దానికి సదరు రైతు ఇస్తున్న సమాధానం ఏమంటే... మనల్ని పాము కరిచినప్పుడు మనం తిరిగి దాన్ని కరిస్తే విషం ఎక్కదని తనకు ఒక స్వామీజీ చెప్పాడని, కాబట్టి తాను డాక్టరు దగ్గరికి పోనన్నాడు. కానీ ఊరివాళ్లు బలవంతంగా సదరు సాల్మొదీన్‌ను డాక్టరు దగ్గరికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. మొత్తానికి ఇలా కూడా కసితీర్చుకునేవాళ్లుంటారా...!!

  • Loading...

More Telugu News