: 2011 గ్రూప్-1 అభ్యర్థులకు ఊరట
2011 గ్రూప్-1 అభ్యర్థులకు ఊరట కలిగిస్తూ ట్రిబ్యునల్ కోర్టు నేడు తీర్పు ఇచ్చింది. వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి, మార్కులను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టు ఏపీపీఎస్సీని ఆదేశించింది. అప్పట్లో కటాఫ్ మార్కుల వ్యవహారంలో 184 మంది అభ్యర్థులు ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించారు. ఆ వ్యవహారంలో కోర్టు నేడు తీర్పు ఇచ్చింది.