: పాప్ స్టార్ బీబర్ పై అభిమానులకు చిర్రెత్తింది


సినీనటులు, సెలబ్రిటీలు తమ ప్రేయసీ ప్రియులతో కనిపించడం సర్వసాధారణమే. దాన్ని అభిమానులు సందడిగా చూస్తారు కూడా. వారి అనుబంధంపై ప్రసారం చేసే మీడియా కథనాలకు మంచి ఆదరణ కూడా ఉంటుంది. తాజాగా, అంతర్జాతీయంగా పేరు ప్రతిష్ఠలున్న పాప్ స్టార్ జస్టిన్ బీబర్ కనిపించకూడని ప్రదేశంలో కన్పించి అభిమానుల హృదయాలను గాయపరిచాడు. పందొమ్మిదేళ్ల పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. బీబర్ ప్రస్తుతం బ్రెజిల్ పర్యటనలో ఉన్నాడు.

ఈ సందర్భంగా ఆయన రియో-డీ-జెనీరోలోని ఓ వేశ్యాగృహంలో తన స్నేహితుడితో కలిసి మూడు గంటలు గడిపాడని న్యూయార్క్ పోస్ట్ కథనాన్ని ప్రసారం చేసింది. వేశ్యాగృహం నుంచి బయటకు వెళ్లే సమయంలో మీడియాకు చిక్కకుండా ఉండేందుకు బాడీగార్డ్ బెడ్ షీట్ తో బీబర్ ముఖాన్ని కప్పి ఉంచారు. బీబర్ వేశ్యను తన హోటల్ రూంకు కూడా తీసుకెళ్లాడని ఫొటో గ్రాఫర్లు ధృవీకరించారు. దీంతో బ్రెజిల్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీబర్ ను పిచ్చిగా అభిమానించి, అనుసరించే వారికి ఆ పాప్ స్టార్ ఏం సందేశమిస్తున్నాడని వారు మండిపడుతున్నారు. దీంతో ఓ కార్యక్రమంలో వేదికపై ఉన్న బీబర్ ను వాటర్ బాటిల్ తో కొట్టారు కూడా!

  • Loading...

More Telugu News