: సచిన్ ను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తిన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్


కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో నెట్ ప్రాక్టీస్ కు వచ్చిన సచిన్ కు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అపూర్వ స్వాగతం పలికింది. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ బస్సులో వచ్చిన సచిన్ కు... ప్రధాన ద్వారం నుంచి డ్రెస్సింగ్ రూం వరకు... 'వెల్ కమ్' అని రాసి ఉన్న టీషర్టులు ధరించిన వంద మంది యువకులు మానవ హారంగా ఏర్పడి స్వాగతం పలికారు. 24 ఏళ్ల సచిన్ కెరీర్ కు సూచకంగా బుజ్జి ఫిరంగులతో ఎర్రని మెరుపు కాగితం ముక్కలు సచిన్ పై పడేలా పేల్చారు. తరువాత డ్రెస్సింగ్ రూం వద్దకు చేరుకునే సరికి... సరిగ్గా తనంత ఒడ్డూ, పొడవుతో అచ్చం తనలాగే ఉన్న మైనపు బొమ్మ సచిన్ కు స్వాగతం పలికింది. దానిని చూసి సచిన్ అద్భుతమైన అనుభూతికి లోనయ్యారు. దీనిని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ తయారు చేయించింది.

  • Loading...

More Telugu News