: సిద్ధిపేటను హైదరాబాదులా మారుస్తా: కేసీఆర్
సిద్ధిపేటపై తనకున్న అభిమానాన్ని కేసీఆర్ మరోమారు బయటపెట్టారు. తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకున్నా, సిద్ధిపేట ప్రజల రుణం తీర్చుకోలేనని అన్నారు. సిద్ధిపేట పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిద్ధిపేటను జిల్లా కేంద్రం చేస్తామని తెలిపారు. అంతేకాకుండా, సిద్ధిపేటను హైదరాబాద్ తో సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అలాగే, ప్రత్యేక రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు.