: మంత్రి కన్నాను నిలదీసిన రైతులు
అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు వేదిక వద్ద రైతులు ఆందోళనకు దిగారు. హెచ్ ఐసీసీ వద్ద జరుగుతున్న సదస్సుకు రైతులను అనుమతించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అనుమతి లేనప్పుడు వ్యవసాయ సదస్సు ఎందుకంటూ... రైతులు మంత్రి కన్నా లక్ష్మినారాయణను నిలదీశారు. జిల్లాల వారిగా ఎంపిక చేసిన రైతులను మాత్రమే అనుమతిస్తున్నట్టు మంత్రి కన్నా వారికి తెలిపారు. దీంతో ఆగ్రహించిన రైతులు... సదస్సును బహుళ జాతి కంపెనీల కోసమే ఏర్పాటు చేసినట్టుందని ఆందోళనకు దిగారు. వ్యవసాయ సదస్సుకు వ్యవసాయదారులను అనుమతించకపోవడం సిగ్గు చేటని నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. వ్యవసాయ సభ్యత్వ నమోదు రుసుము 5 వేల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది.