: ఉత్తరప్రదేశ్ జైళ్లలో ఖాళీ లేదు... !
ఉత్తరప్రదేశ్ జైళ్లలో ఖాళీ స్థలం లేదట. ఇప్పటికే ఒకరుండాల్సిన చోట ఇద్దరు ఖైదీలు ఉన్నారు. నిజమేనండి.. ఉత్తరప్రదేశ్ జైళ్లు ఖైదీలతో కిక్కిరిసిపోయాయి. దేశంలోనే అత్యధిక నేరాల రేటు కలిగిన ఈ రాష్ట్రంలో జైళ్లు నిండిపోవడం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదులేండి. ఉత్తరప్రదేశ్ లోని అన్ని జైళ్లలో 81,027 మంది ఖైదీలు ఉన్నారు. వాస్తవ సామర్థ్యం 48,298 మందే. అంటే 32 వేల మందికిపైగా అదనంగా ఉన్నారు. కొన్ని జైళ్లలో అయితే విచారణ ఖైదీలు( అంటే దోషులుగా కోర్టులు ఇంకా ప్రకటించనివారు) ఎక్కువ మంది ఉన్నారట. ఇలా పరిమితికి మించి ఖైదీలను ఉంచడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది.