: బొలీవియా విమాన ప్రమాదంలో 8 మంది మృతి


ఉత్తర బొలీవియాలో ఏరోకాన్ కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు మృతి చెందగా, పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై ఏరోకాన్ అధికార ప్రతినిధి నెల్సన్ కిన్ మాట్లాడుతూ.. బ్రెజిలియన్ బోర్డర్ లోని రిబెరెల్టా దగ్గర్లో ఉన్న చిన్న పట్టణంలో విమానం ల్యాండ్ అవుతుండగా సాంకేతిక సమస్య చోటు చేసుకుందని.. దాంతో, విమానంలో మంటలు చెలరేగాయని తెలిపారు. విమానంలో మొత్తం పదహారు మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News