: కేంద్రానికి వైఎస్ జగన్ లేఖ


వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖను పార్టీ నేతలు మైసూరా రెడ్డి, కొణతాల రామకృష్ణ నిన్న(ఆదివారం) మీడియాకు విడుదల చేశారు. తమ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని, విభజనకు తాము వ్యతిరేకమని లేఖలో జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ అక్టోబర్ 3న కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని తాము అంగీకరించబోమన్నారు. విభజనను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని 75 శాతం మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి మూడు నెలలుగా ఉద్యమిస్తుంటే కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా మంత్రుల బృందాన్ని (జీవోఎం) ఏర్పాటు చేశారని... దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News