: పార్టీ నేతలతో నేడు చంద్రబాబు కీలక సమావేశం
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు పార్టీ నేతలతో తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇరు ప్రాంతాలకు చెందిన పది మంది ముఖ్య నాయకులు ఈ భేటీలో పాల్గొంటారు. రాష్ట్ర విభజనపై కేంద్రం పంపిన విధివిధానాలు, అనంతరం ఏర్పాటు చేసే అఖిలపక్ష సమావేశం పట్ల అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. దీనికితోడు, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరగనున్న అఖిలపక్ష సమావేశానికి వెళ్లాలా? వద్దా? అనే అంశంపై కూడా సుదీర్ఘ మంతనాలు జరపనున్నారు.