: భూమి కింద నివాసం ఉంటున్నారు
భూమి పైన నివాసం వుంటాం కానీ, భూమి కింద నివాసం ఏమిటి... అని ఆశ్చర్యపోతున్నారా ... అయితే, ఇది చదవండి ... ఆస్ట్రేలియాలోని కూబర్ పెడీ అనే పట్టణాన్ని ప్రపంచంలోనే ఒకే ఒక భూగర్భ పట్టణంగా చెప్పవచ్చు. ఈ పట్టణం 1915లో ఏర్పాటైంది. ఈ ప్రాంతాల్లో స్ఫటికం ఎక్కువగా దొరుకుతుంది. దీంతో మైనెర్లు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు.
అయితే ఇక్కడి వాతావరణం మాత్రం చాలా దుర్భరంగా ఉంటుంది. భరించలేని ఎండలు కాస్తాయి. ఈ ఎండల బారినుండి తట్టుకోవడానికి కొందరు భూగర్భంలో ఇళ్లు కట్టుకోవడం ప్రారంభించారు. ఇలా మైనింగ్కోసం వచ్చిన వాళ్లంతా అదేవిధంగా భూగర్భంలో నివాసం ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు. దీంతో ఇదో భూగర్భ పట్టణంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ పట్టణంలో మూడువేల మందిదాకా నివాసం ఉంటున్నారు. కూబర్ పెడీలో చర్చి, హోటల్ ఇలా అన్ని వసతులూ ఉన్నాయి. 1980 కాలంలో ఈ పట్టణానికి ఎక్కువ ప్రాచుర్యం రావడంతో దేశ దేశాలనుండి దీన్ని చూడడానికి పర్యాటకులు ఈ భూగర్భ పట్టణానికి వస్తున్నారట.