: ఈ టాబ్లెట్లను కావల్సినట్టు వంచుకోవచ్చు!
టాబ్లెట్ అంటే మనం అనారోగ్యం వస్తే వేసుకునే టాబ్లెట్లు కాదు... టాబ్లెట్ పీసీలు. వీటిని వంచడం ఎలా సాధ్యమవుతుంది... అనుకుంటున్నారా... అలాంటి ప్రత్యేక సాంకేతిక విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాదు... మన చేతిలోని ఫోన్ పొరబాటున చేజారి కింద పడిపోతే... ఇక అంతే సంగతులు, ఆ ఫోన్ గురించి మరిచిపోవడం మంచిది అని మనం అనుకుంటాం. అలాకాకుండా చేజారి కింద పడిపోయిన ఫోన్ రేడియం బంతిలాగా బౌన్స్ అయి పైకి లేస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఫోన్లు, చుట్టగా చుట్టేయగలిగిన టాబ్లెట్ పీసీలను తయారుచేయడానికి ఒక సరికొత్త విధానాన్ని ఆస్ట్రేలియాలోని ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీ ఫంక్షనల్ మెటీరియల్స్, మైక్రోసిస్టమ్స్ రీసెర్చ్ గ్రూప్ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటివి వస్తే... అప్పుడు ఎంచక్కా చక్కగా చుట్టేసి టాబ్లెట్ పీసీని జేబులో పెట్టేసుకుని వెళ్లవచ్చు... ఫోన్‌తో బంతాట ఆడుకోవచ్చేమో...!!