: 14 ఏళ్లుగా దీపావళి సందడి లేని గ్రామాలు!
దీపావళి పండగంటే పిల్లలకు, పెద్దలకు విపరీతమైన క్రేజ్. అంతే కాకుండా పండగకు ముందు మూడు రోజులు, తరువాత మూడు రోజులు దీపావళి సందడే. మిగిలిన పండగలన్నీ అలా వచ్చి అలా వెళ్లి పోతాయి. దీపావళి ఒక్కటే వారం రోజులు దాని ప్రభావాన్ని ఎలాగోలా చూపిస్తూ ఉంటుంది. అంత ఆనందాన్నిచ్చే దీపావళిని 8 గ్రామాలు జరుపుకోవడం మానేశాయంటే ఆశ్చర్యమేస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే ... తమిళనాడులోని ఈరోడ్ కు 15 కిలోమీటర్ల దూరంలో వెల్లోడ్ పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది. దీపావళి సందర్భంగా కాల్చే టపాసులకు అవి బెదిరిపోతున్నాయి. దీంతో గత 14 ఏళ్లుగా దాని చుట్టుప్రక్కల 8 గ్రామాల ప్రజలు టపాసులు పేల్చడం మానేశారు. అంతే కాకుండా, దీపావళి రోజున కొత్త బట్టలు వేసుకుని పక్షులను చూస్తూ, చేపలకు ధాన్యం మేత వేసి వస్తుంటారు. గ్రేట్ కదా.. ఆ గ్రామస్థులు ఎంత మంచివారో!