: అమెరికాలో 'మోడీ మ్యాజిక్' స్వీట్లు
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రభంజనం దేశదేశాల్లో మార్మోగిపోతోంది. 'నమో' పేరిట ఫోన్లు విడుదల చేసేందుకు ఓ ఫోన్ల కంపెనీ ప్రయత్నాలు చేస్తుండగా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 'మోడీ మ్యాజిక్' పేరిట స్వీట్లు లభిస్తున్నాయి. భారతీయులు అధికంగా ఉండే ప్రాంతంలో 'మోడీ మ్యాజిక్' పేరిట 11 రకాల మిఠాయిలతో స్వీటు దుకాణాన్ని ఓ ఎన్నారై అందుబాటులో ఉంచాడు. మోడీ ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకునే పదవీకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తానీ స్వీట్లు తయారు చేసినట్టు దుకాణదారు అరవింద్ పటేల్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలలోపు 10 లక్షల స్వీటు ప్యాకెట్లను అమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు. ఈ స్వీటు బాక్స్ విలువ 45 సెంట్లుగా నిర్ణయించారు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మోడీకి అభిమానులున్నారని, ఒక రాజకీయ వేత్త బ్రాండ్ అంబాసిడర్ కావడం ఇదే తొలిసారని ఆయన వివరించారు.