: పులుల సంరక్షణకు ఇద్దరు బుడతలు వెబ్ సైట్ పెట్టేశారు..


ఆరో తరగతి చదివే ఇద్దరు చిన్నారులు మన జాతీయ జంతువు సంరక్షణకు చేతులు కలిపారు. పులులు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయనే విషయాన్ని టీవీలలో ప్రకటనలు, పత్రికలలో వార్తల ద్వారా తెలుసుకున్న ఢిల్లీ విద్యార్థులు శుభం, ఆదర్శ్ తాత్కాలికంగా thundertigers.Weebly.Com వెబ్ సైట్ క్రియేట్ చేశారు. ఇందులో పులుల ఫొటోలు, కొంత సమాచారాన్ని పెట్టారు. కానీ, తగినంతమంది సందర్శకులు లేకపోవడంతో తమకంటూ సొంత డొమైన్ తీసుకోవాలని నిర్ణయించారు. అందుకోసం తమ కాలనీలో నిధుల సేకరణ మొదలుపెట్టారు. వెబ్ సైట్ పెట్టి సందర్శకులు తమ సైట్ ను చూడడం ద్వారా వచ్చే నిధులను జాతీయ జంతు పార్కులకు విరాళంగా ఇవ్వాలన్నది వీరి ఆలోచన. అంతేకాదు, వెబ్ సైట్ ద్వారా పులుల సంరక్షణ ప్రచారాన్ని కూడ నిర్వహించాలనుకుంటున్నారు. వీరిని చూసి ఇప్పుడు తల్లిదండ్రులు, స్నేహితులు, టీచర్లు గర్వపడుతున్నారు.

  • Loading...

More Telugu News