: మృత దేహాలను కేజీహెచ్ కు తరలించండి: మంత్రి బాలరాజు


విజయనగరం జిల్లా గొట్లాంలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన ఎనిమిది మంది మృత దేహాలను రైల్వే ఆసుపత్రి నుంచి కేజీహెచ్ కు తరలించాలని మంత్రి పి బాలరాజు అధికారులను ఆదేశించారు. ఈ ఉదయం మృతులను గుర్తించిన అధికారులు మృత దేహాలను విశాఖలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో ఫ్రీజింగ్ బాక్సుల సౌకర్యం లేకపోవడంతో, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి, సౌకర్యాలు లేనిచోటకు మృత దేహాలను తరలించి ఏం చేస్తారని నిలదీశారు. తక్షణం వాటిని కేజీహెచ్ కు తరలించండని సూచించారు. మరోపక్క గాయపడ్డ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మంత్రి పరామర్శించారు.

  • Loading...

More Telugu News