: యాషెస్ కు వాట్సన్ ఆనుమానం


భారత్ తో జరిగిన సిరీస్ చివరి వన్డేలో బౌలింగ్ చేస్తుండగా గాయపడిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ యాషెస్ సిరీస్ కు అందుబాటులో ఉండడం అనుమానంగా కనపడుతోంది. బౌలింగ్ చేస్తుండగా తొడకండరం పట్టేయడంతో చివరి వన్డేలో 8వ నెంబర్ ఆటగాడిగా షేన్ వాట్సన్ బరిలో దిగాడు. దీంతో మరో 19 రోజుల్లో ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ లో వాట్సన్ ఆడుతాడో లేదో అనే విషయాన్ని నిర్థారించలేకపోతున్నామని ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్ మెంట్ పేర్కొంది. స్వదేశానికి వెళ్లిన తరువాత వాట్సన్ ఫిట్ నెస్ ను పరీక్షించి అతనిని పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఆసీస్ కు వాట్సన్ అదనపు బలం. బౌలింగ్, బ్యాటింగ్ చేయగల వాట్సన్ క్లిక్ అయితే ప్రత్యర్థులు మ్యాచ్ వదిలేయాల్సిందే!

  • Loading...

More Telugu News