: ప్రమాదంపై రైల్వే మంత్రి విచారం.. సహాయక చర్యలకు సీఎం ఆదేశం
విజయనగరం రైలు ప్రమాదంపై ఆ శాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రమాద వివరాలను కలెక్టర్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఎంపీ బొత్స ఝాన్సీ కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించారు. కలెక్టర్ ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం, ఇతర సాయానికి అధికారులు విశాఖ రైల్వే స్టేషన్లో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. 0891-2843003, 2843004, 2843005 నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.