: దీంతో మీరు అతిగా ఖర్చుపెట్టలేరు


ఏదైనా షాపింగ్‌కు వెళ్లినప్పుడు కొందరు ముందు వెనుక చూసుకోకుండా విపరీతంగా కొనేస్తుంటారు. చేతిలో డబ్బు అయిపోయినా, క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి మరీ కొనేస్తుంటారు. ఇలాంటి వారి ఖర్చులకు బ్రేక్‌ వేసే సరికొత్త రకం పర్సులను పరిశోధకులు రూపొందించారు. ఈ పర్సులు మీరు అతిగా ఖర్చుపెడుతుంటే మిమ్మల్ని వారించడానికి మీ నుండి వెనక్కి వెళ్లిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు.

జైమ్‌ అనే స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌ ఆధారంగా పనిచేసే సరికొత్త పర్సులు మీ బ్యాంక్‌ బ్యాలెన్సును బట్టి ప్రవర్తిస్తాయని, ఈ పర్సులను రూపొందించిన జపాన్‌ కంపెనీ చెబుతోంది. మన బ్యాంక్‌ బ్యాలెన్సులో మనం కొనుగోలు చేయడానికి సరిపడా డబ్బులు ఉన్న సమయంలో మాత్రమే మనం ఖర్చుపెట్టడానికి ఈ పర్సు మనకు అనుమతినిస్తుంది. బ్యాంకు ఖాతాలో తక్కువ డబ్బు ఉన్న సమయంలో మనం అతిగా ఖర్చుపెట్టబోతే మననుండి దూరంగా వెళ్లిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఇంకా బలవంతంగా మనం ఇందులో నుండి డబ్బును తీయడానికి ప్రయత్నిస్తే మన ఇంట్లో వాళ్లకు మెసేజ్‌లు, ఈమెయిళ్లు పంపడంతోబాటు హెల్ప్‌, హెల్ప్‌ అంటూ అరిచి గోలచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి ప్రత్యేకమైన పర్సులను బయటి వ్యక్తులకు అమ్మే ఉద్దేశం లేదని ఈ పర్సులను తయారుచేసిన కంపెనీ చెబుతోంది. ఇలాంటి పర్సులు వస్తే అతిగా ఖర్చుచేసేవారికి కళ్లెం వేసేందుకు చక్కగా ఉపయోగపడతాయి కదూ!

  • Loading...

More Telugu News