: విద్వేషపూరిత ప్రసంగం రెండవ కేసులోనూ వరుణ్ గాంధీకి ఊరట


విద్వేషపూరిత ప్రసంగం రెండవ కేసులో బీజేపీ పార్లమెంటు సభ్యుడు వరుణ్ గాంధీకి ఊరట లభించింది. 2009 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ నియోజకవర్గం నుంచి వరుణ్ గాంధీ పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచార ప్రసంగంలో ముస్లింలకు వ్యతిరేకంగా, మిగతా వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు.

దీంతో
 అక్కడి స్థానిక న్యాయస్థానంలో ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో గత నెలలోనే కోర్టు వరుణ్ ని నిర్ధోషిగా ప్రకటించింది. కాగా, నేడు రెండవ కేసులోనూ వరుణ్ గాంధీని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

  • Loading...

More Telugu News