: ప్రపంచ క్రికెట్ చరిత్రలో ద్విశతక వీరులంతా భారత యోధులే!


అంతర్జాతీయ వన్డేల్లో ద్విశతకాలు చేసిన యోధులంతా భారతీయులే కావడం విశేషం. టీమిండియా ఆణిముత్యాలు మూడూ ద్విశతకాలు నమోదు చేసి ప్రపంచ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉండగా, తరువాత అత్యధిక పరుగులు చేసిన రికార్డు బెంగళూరులో చెలరేగిన రోహిత్ శర్మది. మూడో అత్యధిక స్కోరు లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ది. 2010లో గ్వాలియర్ లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో వీరవిహారం చేసిన సచిన్ తొలి ద్విశతకాన్ని నమోదు చేస్తే, 2011లో ఇండోర్ మ్యాచ్ లో విండీస్ పై చెలరేగిన వీరూ (219) వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

ఈ రోజు బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో చితక్కొట్టిన రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. దీంతో వన్డేల్లో సాధించిన అత్యధిక పరుగులు భారత గడ్డపైనే రావడం ఒక రికార్డైతే. వీటిని సాధించిన ముగ్గూరూ భారతీయులే కావడం ఇంకో రికార్డు. రోహిత్ ఆసీస్ పై అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పడం విశేషం.

  • Loading...

More Telugu News