: రోహిత్ 150.. భారత్ 300
ఆసీస్ తో జరుగుతున్న చివరి వన్డేలో రోహిత్ శర్మ తిరుగులేని ఆటతీరుతో ఆజేయంగా 156 పరుగులు సాధించాడు. 11 సిక్స్ లతో భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సులు కొట్టిన రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 142 బంతుల్లో 156 పరుగులు చేసిన రోహిత్ భారత ఇన్నింగ్స్ లో సగం స్కోరు తనే చేసినట్టయింది. మంచి ఊపుమీదున్న రోహిత్ భారత ఇన్నింగ్స్ కు ఊపు తెచ్చాడు. దీంతో భారత జట్టు 300 పరుగుల స్కోరు దాటింది.