: రోహిత్ సెంచరీ.. భారత్ 218/4
ఆసీస్ తో జరుగుతున్న చివరి వన్డేలో భారత జట్టు భారీ స్కోరుదిశగా సాగుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ వీరోచిత సెంచరీతో అదరగొట్టాడు. దీంతో భారత జట్టు 38 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 218 పరుగులు సాధించింది. ఓపెనర్లు నిలకడగా ఆడడంతో భారత జట్టు తొలి వంద పరుగులు నిలకడగా సాధించింది. ధావన్(60) అవుటవ్వడంతో తరువాత వచ్చిన కోహ్లీ(0) కూడా వెంటనే వెనుదిరిగాడు. తరువాత రైనా(28) కాస్త నిలకడగా ఆడుతున్నట్టు కనిపించి తనూ ఔటయ్యాడు. ఆ యువరాజ్ సింగ్(12) కూడా వెనుదిరగడంవెంటనే తో ధోని(6) అండతో రోహిత్ (101)సెంచరీ చేశాడు.