: పైలిన్ బాధిత ప్రాంతాల్లో ప్రధాని నేటి పర్యటన రద్దు
ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలోని పైలిన్ తుపాను బాధిత ప్రాంతాలలో ప్రధాని మన్మోహన్ పర్యటన రద్దయింది. ప్రధాని ఆయా ప్రాంతాలలో నేడు పర్యటించడంతోపాటు, ఏరియల్ సర్వే కూడా చేయాల్సి ఉంది. అయితే, నష్టంపై ఇంకా అంచనాలు పూర్తి కావాల్సి ఉందని, ఈ నేపథ్యంలో పర్యటన రద్దు చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.