: చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ నేత గట్టు ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. హైదరాబాదులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు చేస్తున్న 'వస్తున్నా- మీ కోసం' పాదయాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
పాదయాత్రలో చంద్రబాబు ఏనాడూ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయలేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిల మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని గట్టు రామచంద్రరావు ఆరోపించారు. జగన్ ను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తుండటంతోనే, వారికి జగన్ అంటే ఎంత భయమో అర్ధమవుతోందని ఆయన అన్నారు.