: ఏప్రిల్ లో భారత్, పాక్ హాకీ సిరీస్


ద్వైపాక్షిక సిరీస్ ఒప్పందంలో భాగంగా ఏప్రిల్ లో పాకిస్థాన్, భారత్ హాకీ జట్ల మధ్య టెస్టు మ్యాచులు జరగనున్నాయి. మలేషియా సమావేశంలో ఇరు దేశాలు ఈ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. పాక్ జట్టు భారత్ లో టెస్టు మ్యాచులలో పాల్గొంటుంది.

ఏప్రిల్ 5 నంచి 15 వరకు రాంచీ, జలంధర్, న్యూఢిల్లీ, లక్నో, మోహలీలో ఈ మ్యాచ్ లు జరుగుతాయని పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. అనంతరం భారత హాకీ జట్టు రెండు టెస్టు మ్యాచులను పాక్ లోని లాహోర్, కరాచీ, ఫైసలాబాద్, సియోల్ కోటల్లో ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు ఆడనుంది.

మీడియా భాగస్వాములతో సంప్రదించిన తర్వాతే 
ఈ ప్రకటన విడుదల చేసినట్లు అందులో తెలిపారు. గతనెల మలేషియాలో జరిగిన ఏషియన్ హాకీ ఫెడరేషన్ సమావేశంలో పాక్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఖాసిం జియా, సెక్రటరీ ఆసిఫ్ బజ్వా ... ఇండియన్ హాకీ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇందులో సిరీస్ లపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

కాగా, 
గత సంవత్సరం డిసెంబర్ లో హాకీ ఇండియా సెక్రటరీ నరేంద్ర బాత్రా లాహోర్ లో పర్యటించినప్పుడు పాక్ హాకీతో సిరీస్ పై ఒప్పందం కుదుర్చుకున్నారు. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత ఇరు దేశాల మధ్య సిరీస్ లు జరగనుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News