: ప్రేవేటు బస్సులపై ఉక్కుపాదం.. 3 రోజుల్లో 150 బస్సులు సీజ్
మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన జబ్బర్ ట్రావెల్స్ బస్ ప్రమాదంతో అధికారుల్లో చలనం వచ్చింది. నిద్రావస్థను వీడిన రవాణా శాఖాధికారులు ప్రైవేటు ట్రావెల్స్ పై ఉక్కు పాదం మోపారు. దీంతో గత మూడు రోజుల్లో నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న వివిధ ప్రైవేటు సంస్థలకు చెందిన 150 బస్సులను సీజ్ చేశారు. గత మూడు రోజులుగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్న ఆర్టీఏ అధికారులు ప్రైవేటు సంస్థలకు చెందిన బస్సుల్లో పలు లోపాలను గుర్తించారు. దీంతో వాటిని సీజ్ చేశారు.