: ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 12 మందికి గాయాలు
ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో 12 మంది గాయపడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల దగ్గర జరిగింది. మహబూబ్ నగర్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని పిడుగురాళ్లలోని ఆసుపత్రికి తరలించారు.