: ఇక లైట్లు మరింత కాంతిమంతంగా వెలుగుతాయి


ఎల్‌ఈడీ లైట్లు ఎక్కువ కాంతిని వెదజల్లుతాయి. ఇలా ఎక్కువ కాంతితో వెలగడానికి కారణం వాటిలో ఉండే పాస్ఫరస్‌ అనే మూలకం. అయితే, ఈ లైట్లను మరింత కాంతిమంతంగా మండించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ఉపయోగించే పాస్ఫరస్‌ మూలకంపై శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ పద్ధతి కాకుండా రేషనల్‌ పద్ధతి ద్వారా పాస్ఫరస్‌ను ఉపయోగిస్తే ఎల్‌ఈడీ లైట్లను మరింత కాంతిమంతం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే, ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద కొన్ని ఫాస్ఫర్లు మాత్రమే తమ సామర్ధ్యాన్ని కలిగి ఉంటున్నాయని, ఇలాంటి వాటిని గుర్తించడం కష్టమవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1998లో నోబెల్‌ లారియేట్‌ వాల్టర్‌ కోన్‌ ప్రతిపాదించిన డెన్సిటీ ఫంక్షనల్‌ సిద్ధాంతం ఆధారంగా పాస్ఫరస్‌ సామర్ధ్యాన్ని కనుగొనవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News