: మీడియాను నియంత్రించండి: కోర్టుకు ఆశారాం బాపు


పిల్లల రక్తం తాగే డ్రాకులాలా మీడియా తనను చిత్రీకరిస్తోందని, దానిపై కోర్టు జోక్యం చేసుకుని మీడియాకు మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. తనకు వ్యతిరేకంగా మీడియాలో ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తూ తన భార్య, కుమార్తెలు తనకు మహిళల్ని సరఫరా చేస్తున్నారంటూ ఆరోపించడాన్ని ఆయన పిటిషన్లో తప్పు పట్టారు. అయితే, పోలీసుల నుంచి ఇతర మార్గాల నుంచి మీడియా సేకరించిన సమాచారాన్ని ప్రసారం చేయడాన్ని తప్పుపట్టలేమని పేర్కొన్న సుప్రీంకోర్టు ఆ పిటిషన్ కొట్టివేసింది.

  • Loading...

More Telugu News