: రికార్డు దిశగా బాక్సింగ్ డే టెస్టు


ఆస్ట్రేలియాలో జరగనున్న యాషెస్ సిరీస్ లో నాలుగో టెస్టు సందర్భంగా సరికొత్త రికార్డు నమోదయ్యే అవకాశముంది. బాక్సింగ్ డే రోజు అంటే డిసెంబర్ 26న మెల్ బోర్న్ లో మొదలయ్యే టెస్టు తొలి రోజు టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. మెల్ బోర్న్ స్టేడియం సామర్థ్యం లక్ష. ఇప్పటికే టికెట్లన్నీ విక్రయించడంతో ప్రేక్షకులంతా హాజరైతే సరికొత్త రికార్డు నమోదు కానుంది. 1961లో ఎంసీజీలో ఆసీస్, విండీస్ మ్యాచ్ కు 90,800 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఇప్పటిదాకా అత్యధిక ప్రేక్షకులు ప్రత్యక్షంగా చూసిన మ్యాచ్ గా ఇదే రికార్డు. బాక్సింగ్ డే టెస్టుకు వందశాతం ప్రేక్షకులు హాజరైతే పాత రికార్డు మాసిపోనుంది. కాగా, ఈ మ్యాచ్ కు మిగిలిన నాలుగు రోజుల టికెట్లు అందుబాటులో ఉన్నాయి. బ్రిస్బేన్ లో ఈ నెల 21 నుంచి యాషెస్ తొలి టెస్టు మొదలు కానుంది.

  • Loading...

More Telugu News