: ట్రావెల్స్ బస్సులపై కొనసాగుతున్న ఆర్టీఏ తనిఖీలు
మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జబ్బార్ ట్రావెల్స్ వోల్వో బస్సు అగ్నిప్రమాదానికి గురై 45 మంది మరణించిన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ పై చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు తనిఖీలు ముమ్మరం చేశారు. నిన్న వందకు పైగా కేసులు నమోదు చేసిన అధికారులు నేడు 120 బస్సులపై కేసులు నమోదు చేశారు. మరో 84 బస్సులను సీజ్ చేశారు.