: త్వరలోనే జగన్ రాష్ట్ర పర్యటన: కొణతాల
వైఎస్సార్సీపీ అధినేత జగన్ త్వరలోనే రాష్ట్ర పర్యటన చేపడతారని... ఆ పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. పర్యటన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. దీనికి తోడు, కేంద్రం మరోసారి తలపెట్టిన అఖిలపక్ష సమావేశానికంటే ముందుగానే శ్రీకృష్ణ కమిటీ నివేదికను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న విజయమ్మను పోలీసులు అడ్డుకున్న విషయాన్ని తాము మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు.