: రాజకీయ పార్టీలన్నీ అఖిలపక్షాన్ని బహిష్కరించాలి: జస్టిస్ లక్ష్మణరెడ్డి
రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యుడు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజనపై శ్రీకృష్ణ కమిటీ రిపోర్టును కేంద్రం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో, కేంద్రం ఏర్పాటు చేయనున్న మరో అఖిలపక్ష భేటీకి అన్ని రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలని లక్ష్మణరెడ్డి కోరారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడం అప్రజాస్వామికమని లక్ష్మణరెడ్డి విమర్శించారు.