: అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు: వైఎస్సార్సీపీ నేతలు
తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల తీరు అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అన్నట్టు ఉందని కరీంనగర్ జిల్లా వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. సీమాంధ్రతో పాటు తెలంగాణలో కూడా వరదలొచ్చి భారీగా పంటనష్టం సంభవిస్తే కనీసం పరామర్శకు కూడా రాని కాంగ్రెస్ మంత్రులు అధికారబలంతో విజయమ్మ పర్యటనను అడ్డుకున్నారని ఆరోపించారు. జరిగిన ఘటనకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలని, కాంగ్రెస్ నేతలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.