: తగ్గుతున్న ఉష్ణోగ్రతలు.. మొదలైన చలి
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. చలి మొదలైంది. ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాలలో 15 డిగ్రీలకు పడిపోయాయి. గురువారం ఆదిలాబాద్ లో ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్, హకీంపేట, మెదక్, నిజామాబాద్, రామగుండంలో 17 డిగ్రీలు, మహబూబ్ నగర్, ఆరోగ్యవరంలో 19 డిగ్రీలు, అనంతపురం, నందిగామలో 20 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.