: టపాసులు వద్దు ... పర్యావరణం ముద్దు!


నవతరం పిల్లల్లో శుభకరమైన ఆలోచనలు వస్తున్నాయి. టపాకాయల మీద డబ్బు తగలేయడం వృథా అని, టపాకాయలు అనేవి కేవలం కాల్చేవారికే కాకుండా పర్యావరణానికి కూడా ప్రమాదకరం అని హెచ్చరిస్తూ పటాసులకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం ఇవాళ స్కూలు పిల్లల్లో గణనీయమైన మార్పు తీసుకువచ్చినట్లుగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా పాఠశాల పిల్లల్లో టపాసులకు వ్యతిరేకంగా ఓ భారీ ప్రచారం నిర్వహించారు. దీని ఫలితమే అన్నట్లుగా ఈ దఫా 20 నుంచి 25 శాతం వరకు టపాకాయల విక్రయాలు పడిపోయినట్లు ఓ సర్వే చెబుతోంది.

ఈ ఏడాది టపాకాయల ధరలు పదినుంచి పదిహేను శాతం వరకు పెరిగాయి. అయితే అమ్మకాలు పడిపోవడానికి మాత్రం ప్రధానంగా.. పాఠశాలల్లో జరిగిన ప్రచారమే కారణం అని సర్వే నిర్వాహకులు చెబుతున్నారు. ఈ తరం పిల్లల్లో అవగాహన పెరుగుతోందని, స్కూళ్లలో టపాకాయలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నారని వారంటున్నారు. అసోచాం నిర్వహించిన ఈ సర్వేలో బృందం.. 15 నగరాల్లోని 150 స్కూళ్ల విద్యార్థులనుంచి వివరాలు సేకరించింది.

  • Loading...

More Telugu News