: రేపటికి వాయిదాపడిన లోక్ సభ
పలు అంశాలపై గందరగోళ చర్చతో ఒకసారి వాయిదాపడిన లోక్ సభ 12 గంటలకు మొదలై వెంటనే రేపటికి వాయిదా పడింది. పెట్రోల్ ధరలు, యూపీ డీఎస్పీ హత్య కేసు, కాగ్ నివేదికలపై సభ్యులు అధికార పక్షాన్ని నిలదీశారు. ప్రధానంగా డీఎస్పీ హత్య కేసుపై జరిగిన చర్చ తీవ్ర అలజడికి దారితీసింది. అటువైపు రాజ్యసభలోనూ ఇవే అంశాలపై గందరగోళం ఏర్పడడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదాపడింది.