: రండి.. భారత విమానయాన రంగంలో పెట్టుబడి పెట్టండి: అజిత్ సింగ్


భారత విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టాలని అమెరికన్ ఇన్వెస్టర్లను భారత పౌర విమానయాన శాఖా మంత్రి అజిత్ సింగ్ ఆహ్వానించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన వాషింగ్టన్ లో భారత్-అమెరికా 4వ ఏవియేషన్ సదస్సు సందర్భంగా మాట్లాడుతూ.. భారత విమానయాన రంగంలో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు కల్పించే క్రమంలో పలు సంస్కరణలు చేపట్టామని అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచినట్టు తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విమాన సర్వీసులు నడిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని, పెట్టుబడులకు ఇదే సరైన సమయమని అజిత్ సింగ్ సూచించారు.

  • Loading...

More Telugu News