: పంట రుణాల మాఫీపై పార్లమెంట్ కు కాగ్ నివేదిక
రైతులకు పంట రుణాలు మాఫీ చేయడంలో పలువురు అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ రోజు పార్లమెంటులో రైతులకు పంట రుణాలపై కాగ్ తన నివేదికను ఇచ్చింది. అర్హులైన లబ్దిదారులకు రుణాల మాఫీ వర్తింపజేయలేదని కాగ్ తన నివేదికలో వెల్లడించింది. దీని ద్వారా అధికారులు ప్రయోజనం పొందిఉండవచ్చని పరోక్షంగా పేర్కొంది.