: క్రీడాశాఖ నుంచి గుత్తా జ్వాలకు ఇవ్వాల్సిన మద్దతును పెంచుతాం: క్రీడా మంత్రి


బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల-బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) మధ్య వ్యవహారంపై కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ రాసిన లేఖకు క్రీడాశాఖ మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. జ్వాల విషయాన్ని పరిశీలిస్తానని, ఆమెకు మద్దతును ఇచ్చే విషయాలను పరిశీలిస్తామని చెప్పారు. తమకు సాధ్యమైనంత మేర జ్వాలకు మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తామని.. ఈ మేరకు మొయిలీకి రాసిన తిరుగు లేఖలో జితేంద్ర పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున అందరు క్రీడాకారుల మాదిరిగానే ఆమెకు కూడా తమ మద్దతు ఉంటుందన్నారు. వచ్చే ఏడాది జరిగే కామన్ వెల్త్, ఏషియన్ గేమ్స్ లో కూడా జ్వాల పాల్గొంటుందని లేఖలో వివరించారు.

  • Loading...

More Telugu News