: సీఎం హద్దుదాటి లేఖలు రాస్తున్నారు: పాల్వాయి
రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హద్దులు దాటి లేఖలు రాస్తున్నారని కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, లేఖలు రాసే అధికారం ఆయనకు ఉన్నా కేబినెట్ అనుమతి లేకుండా ఎలా లేఖలు రాస్తారని ఆయన ప్రశ్నించారు. జీఎంవో పురోగతిని వివరించేందుకే అఖిలపక్షం అని పాల్వాయి తెలిపారు. విభజన ప్రక్రియలో తమ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోలేదంటున్న ప్రతిపక్షాల కోరికమేరకే అఖిలపక్షం అని ఆయన స్పష్టం చేశారు.