: విజయమ్మ అరెస్ట్.. సీఎం బాధ్యత వహించాలంటున్న శోభ


వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను నల్గొండ జిల్లా పైనంపల్లి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. వరద బాధితులను పరామర్శించేందుకు ఆమె తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తుండగా.. దానిని తెలంగాణవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పర్యటనను పలు చోట్ల అడ్డుకున్నారు. దీంతో, శాంతిభద్రతల నేపథ్యంలో ఆమెను పోలీసులు అరెస్టు చేసి నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, విజయమ్మ అరెస్టుకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని వైఎస్సార్సీపీ మహిళా నేత శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. విజయమ్మ పర్యటనను అడ్డుకునే హక్కు సర్కారుకు ఎవరిచ్చారని ఆమె ప్రశ్నించారు. హైదరాబాదులో ఈ సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News