: పడిపోయిన సైనా ర్యాంక్.. మెరుగైన సింధు


భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కు ఈ ఏడాది కలిసి రావట్లేదు. స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్న సైనా నెహ్వాల్ ర్యాంకుల్లో పతనం దిశగా కదులుతోంది. దేశీ టోర్నీల్లో ప్రత్యర్థులను చిత్తు చేస్తున్న సైనా విదేశాల్లో చతికిల పడుతోంది దీంతో, గతవారం ఆరో ర్యాంకుకు పడిపోయిన సైనా.. ఫ్రెంచ్ ఓపెన్ రెండో రౌండ్లో చేతులెత్తేయడంతో తాజాగా మరోస్థానం పతనమై ఏడో ర్యాంకుకు చేరింది. కాగా, యువ సంచలనం పీవీ సింధు ఒక ర్యాంకు మెరుగుపర్చుకుని పదోస్థానానికి చేరుకుంది. పురుషుల విభాగంలో కశ్యప్ ఓ ర్యాంకు కోల్పోయి 12వ స్థానానికి చేరుకున్నాడు.

  • Loading...

More Telugu News