: సచిన్ రిటైర్మెంటు నేపథ్యంలో వేడెక్కుతున్న బెట్టింగ్ మార్కెట్
లెజెండరీ బ్యాట్స్ మన్ సచిన్ టెండూల్కర్ మరికొద్ది వారాల్లో క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్న నేపథ్యంలో బెట్టింగ్ మార్కెట్ క్రమంగా వేడెక్కుతోంది. విండీస్ తో జరిగే టెస్టు సిరీస్ లో ఒక్కో టెస్టుపై సుమారు రూ.800 కోట్ల మేర బెట్టింగ్ జరగనుందని అంచనా. 2011 వన్డే ప్రపంచకప్ తర్వాత ఓ మ్యాచ్ పై ఇంత భారీ మొత్తంలో బెట్టింగ్ జరగనుండడం ఇదే ప్రథమం. విండీస్ తో జరిగే టెస్టు సిరీస్ తో సచిన్ తన కెరీర్ ముగిస్తుండడమే ఇందుకు కారణం. ఈ సిరీస్ లో సచిన్ సెంచరీ సాధిస్తే పందెంరాయుళ్ళు తాము పందెం కాసిన ప్రతి రూపాయికి నాలుగున్నర రూపాయలు అదనంగా పొందుతారు. మాస్టర్ గనుక డబుల్ సెంచరీ సాధిస్తే ఆ మొత్తం రూ.11 రూపాయలవుతుంది. అంటే రూపాయికి పదకొండు రూపాయలు గిట్టుబాటు అవుతాయన్నమాట. ఇక, హాఫ్ సెంచరీ సాధిస్తే బుకీలు ప్రతి రూపాయికి 80 పైసలు ఇవ్వనున్నారు. మరి, సచిన్ అటు అభిమానులను ఇటు బుకీలను మురిపిస్తాడో, లేదో తెలియాలంటే మరికొన్ని రోజుల ఆగాల్సిందే.