: హేమమాలిని తొలి మ్యూజిక్ ఆల్బమ్ విడుదల
బాలీవుడ్ డ్రీమ్ గాళ్ హేమమాలిని ఇన్నాళ్లు తన అందం, నటన, నృత్యంతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆమె ఓ మ్యూజిక్ ఆల్బమ్ ని విడుదల చేశారు. 'సౌందర్య లహరి' పేరుతో రూపొందించిన ఈ ఆల్బమ్ ను నిన్న (బుధవారం) ముంబయిలో విడుదల చేశారు. ఈ 'సౌందర్య లహరి' గీతగుచ్ఛం పూర్తి సంస్కృతంలో ఉంటుందని తెలిపారు. ఆల్బమ్ పరిచయ వాక్యాలను బిగ్ బి అమితాబ్ బచ్చన్ పలికినట్లు చెప్పారు.